ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | CMFRI Notification 2024 | Latest Telugu Jobs
CMFRI Notification 2024:
విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) రీజినల్ సెంటర్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్ విభాగాల్లో డిగ్రీ కలిగిన 21 నుండి 45 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Application and Interview Dates:
అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 4 నుండి నవంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 26న విశాఖపట్నంలోని CMFRI ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయబడతారు.
Job Details:
ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంస్థలోని 01 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్ లో డిగ్రీ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Selection Process:
అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా 26న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000 రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఇతర భత్యాలు, అలవెన్సులు లేవు.
Application Process:
దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి vrcofcmfri@gmail.com కు నవంబర్ 21లోగా పంపాలి. స్కాన్ చేయని అప్లికేషన్లు ఆమోదించబడవు.
Required Certificates:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికట్లు
How to Apply:
క్రింద ఉన్న నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకొని, వెంటనే దరఖాస్తు చేసుకోండి.