ఏపీవైపు కెగ్జిమ్‌ చూపు

 

ఐటీ మంత్రిని కలిసిన కెగ్జిమ్‌ బ్యాంకు ప్రతినిధులు






  • రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా సంస్థల ఆసక్తి
  • ఐటీ మంత్రిని కలిసిన కెగ్జిమ్‌ బ్యాంకు ప్రతినిధులు

అమరావతి (చైతన్య రథం): పారిశ్రామిక ప్రగతిని పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రణాళికలు దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌’కు సమాంతరంగా ‘స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌’ నినాదాన్ని తెరపైకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ను విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే ప్రాధమ్యంగా వడివడి అడుగులేస్తున్న లోకేష్‌.. ఫలితాలు సాధించి చూపిస్తున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంపై విశ్వాసం కూడా ఏపీకి అనుకూల వాతావరణంగా కనిపిస్తోంది. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగా చెన్నైలోని కొరియా కాన్సులేట్‌ జనరల్‌ కిమ్‌ చాంగ్‌ యున్‌తో పాటు కొరియన్‌ కెగ్జిమ్‌ (ఎగ్జిమ్‌ బ్యాంకు ఆఫ్‌ కొరియా) ఈడీసీఎఫ్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌-2 డైరెక్టర్‌ జనరల్‌ కెవిన్‌ చోయ్‌, బ్యాంక్‌ ఎన్డీఆర్వో ముఖ్యప్రతినిధి జంగ్‌ వాన్‌ రియూ, కొరియా ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (కొయికా) డైరెక్టర్‌ చాంగ్‌ వూ చాన్‌ బుధవారం సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలపై ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెగ్జిమ్‌ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్‌ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించిన అంశాన్ని వివరించారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నారా లోకేష్‌ కోరారు.

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2