వాలంటీర్లకు ఒక ముఖ్యమైన గమనిక. ఎన్నికలకు ముందు రాజీనామా పత్రాలను అందించిన వారి స్టేటస్ అనగా ఆ రాజీనామా పత్రాలను స్వీకరించినారా లేదా అనేది ఈ క్రింద ఇవ్వబడినటువంటి లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ సమాచారం ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రభుత్వము ఇదివరకే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది.ఈ లిస్టు లోని వాలంటీర్లు కి మాత్రమేఉద్యోగం..!Ap volunteer jobs latest news
కావున ఈ లింకు ద్వారా మీరు రాజీనామా చేయనటువంటి లిస్టులో ఉంటారని భావించవచ్చు. అలానే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల స్థితి అనగా రాజీనామా చేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
చెక్ చేసుకునే విధానం
- పైన ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి
- మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి
- మీ మండలం సెలెక్ట్ చేసుకోండి
- మీ పంచాయతీ లేదా వార్డు సచివాలయంలో సెలెక్ట్ చేసుకోండి.
- మీ పంచాయతీ లేదా వార్డు సచివాలయం చివరన అడ్డు వరుసలో వాలంటీర్ల సంఖ్య ఉంటుంది.
- ఆ సంఖ్య మీద క్లిక్ చేస్తే వాలంటీర్లు రాజీనామా చేయకున్నటువంటి వారి పేర్లు కనిపిస్తాయి.
పైన తెలిపిన విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే పేరు ఉన్నవాళ్లు రాజీనామా చేయనటువంటి వాళ్ళు.
వారికి ఉద్యోగ భద్రత మరియు పదివేల రూపాయల జీతము, రెండు నెలలు బకాయి ఉన్నటువంటి జీతం కలిపి ఇవ్వబడును.
రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి
కొత్త ఉద్యోగాలకు అవకాశం
వాలంటీర్ల ఉద్యోగాలు కొత్తగా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
వాలంటీర్లకు కొత్త వారికి అవకాశం ఉంటుందంటే దీనికి 25% అవకాశం ఉండవచ్చు ఎందుకనగా ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లను వ్యవస్థను రూపు రేఖలు మార్చబోతున్నటువంటి ప్రభుత్వము వాలంటీర్ల ఉద్యోగ భద్రతగా మరియు వారికి పదివేల రూపాయల జీతం ఇవ్వాలంటే వారికి కచ్చితంగా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కచ్చితంగా ఉండాలి అని చెప్పినట్లయితే
ప్రస్తుతం 36% వాలంటీర్లు పదవ తరగతి మీద ఉద్యోగం చేసేవారు వారందరినీ తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వవచ్చు.