70 ఏళ్ల వయసు దాటిన వారికి.. రూ.5 లక్షల ఉచిత బీమా.. ఎలా పొందాలంటే?

 

AB PMJAY: దేశంలో 70 ఏళ్ల వయసు దాటిన వారికి ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వారికి సైతం





AB PMJAY: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 11, 2024 రోజునే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆదాయ పరిమితితో ఎలాంటి సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తామని వెల్లడించింది. దీంతో దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు, 4.5 కోట్ల కుటుంబాలకు లబ్దిచేకూరుతుందని తెలిపింది. ఒక్కో కుటుంబానికి ఉచితంగా 5 లక్షల బీమా వర్తిస్తుంది. దానిపైన సీనియర్లకు అదనంగా రూ.5 లక్షల బీమా కవరేజీ కల్పిస్తారు.ఆయుష్మాన్ భారత్‌లో రూ.5 లక్షల బీమా కల్పించేందుకు సీనియర్ సిటిజన్లకు అందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కి ఇది అదనంగా చెప్పవచ్చు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి సైతం రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ పథకంలో లేని కుటుంబాలకు చెందిన 70 ఏళ్లుపైబడిన వారు ఇందులో చేరవచ్చు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య పథకాలైన ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, సాయుధ దళాల ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వంటి వాటిలో ఉన్న వారు అందులోనే కొనసాగవచ్చు. లేదా కొత్త పథకంలో చేరవచ్చు.


Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2