Talliki Vandanam Scheme ఏపీలో మహిళలకు శుభవార్త 15,000
Talliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లులందరికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. తల్లికి వందనానికి సంబంధించి అఫీషియల్ గా జీవో మరియు విధివిధానాలు రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం.
తల్లికి వందనం పథకం సమాచారం
✓ పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
✓ ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.
✓ BPL (Below Poverty Line) కుటుంబాలకు చెందిన వారై ఉండాలి . దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.
✓ విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను.
✓ ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు / సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.
✓ పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.
Talliki Vandanam Official GO :: Click Here
తల్లికి వందనం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే పైనున్న పిడిఎఫ్ లింక్ ని ఓపెన్ చేసుకొని అఫీషియల్ జీవో ని పూర్తిగా ఫాలో అవ్వగలరు.
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.